హైదరాబాద్: పితృ వియోగంలో ఉన్న మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. సుజనా చౌదరి తండ్రి ఇంజనీర్ జనార్ధన్ రావు ఇటీవలే పరమపదించారు. దీంతో ఆయన ఇంటికి వెళ్ళిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సుజనా చౌదరితో కొద్దిసేపు మాట్లాడారు. సుజనా చౌదరి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. జనార్ధన్ రావు చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. గతంలో తనకు ఆ కుటుంబంతో ఉన్న జ్ఞాపకాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తు చేసుకున్నారు.