బీజేపీ పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే సీతక్క
వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా: పెంచిన పెట్రోల్ ధరలకు నిరసనగా ములుగుజిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో జాతీయ రహదారి పై ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగుఎమ్మెల్యే సీతక్క మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్ళతో టాటా మ్యాజిక్ లాగుతూ నిరసన తెలిపారు.అనంతరం ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ . క్రిష్ఞ ఆదిత్యకు వినతి పత్రం అందించారు. లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలపై 20 రోజులుగా వరుసగా పెట్రోల్ ధరలు పెంచుతూ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరింత భారాన్ని మోపుతుందని జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఇలాంటి సమయంలో ప్రజలకు ధరలు తగ్గించి ఊరటనివ్వాల్సింది పోయి ధరలు పెంచడం దారుణమని విమర్శించారు. పెంచిన పెట్రోల్ , డీజీల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.