నీరాకేఫ్‌ ను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్‌: నీరా స్టాల్‌.. గౌడ వృత్తి వారి అస్థిత్వానికి ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలోనే తొలి నీరాకేఫ్‌ ఏర్పాటుకు నగరంలోని నెక్లెస్‌రోడ్డులో మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌ కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో నీరాకేఫ్‌ ను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల్లో ఎంతో వృత్తి నైపుణ్యం ఉందన్నారు. రాష్ట్రంలో గీత వృత్తిపై ఆధారపడి 2 లక్షల మందికి జీవిస్తున్నారని తెలిపారు. కుల వృత్తుల అభివృద్ధితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందనేది సీఎం కేసీఆర్‌ నమ్మకమని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం రూ. 16 కోట్ల వృత్తి పన్ను బకాయిలను రద్దు చేసిందని గుర్తు చేశారు. నీరా స్టాల్‌.. గౌడవృత్తి వారి అస్థిత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని నీరా స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ అన్నారు.