హార్ధిక్​ పనికి నెటిజన్లు ఫిదా

హార్ధిక్​ పనికి నెటిజన్లు ఫిదాఆసీస్​తో జరిగిన చివరి టీ20లో ఓడిపోయినప్పటికీ టీమిండియా2-1 తేడాతో సిరీస్​ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్​లో దనాధన్​ ఇన్నింగ్స్​లతో అలరించిన ఆల్​రౌండర్​ హార్ధిక్​పాండ్యకు ‘మ్యాన్​ఆప్​ దిసిరీస్​’దక్కింది. అయితే తనకు దక్కిన అవార్డును యువ సంచలన బౌలర్​ టీ నటరాజన్​ హార్దిక్​ అందించారు. క్లిష్ట పరిస్థితుల్లో కెరీర్​ ఆరంభ మ్యాచ్​ల్లోనే గొప్పగా బౌలింగ్ చేసిన నటరాజన్​కు ఈ అవార్డు దక్కాలని హార్ధిక్​ ట్విటర్​ వేదికగా పంచుకున్నాడు.‘ నటరాజన్​ ఈ సిరీస్​లో నువ్వు చేసిన ప్రదర్శన అద్భుతం. ప్రారంభ మ్యాచ్​లోనే క్లిష్ట పరిస్థితుల్లో గొప్పగా బౌలింగ్​ చేసిన విధానమే తెలియజేస్తుంది నీశ్రమ సామర్ధ్యాలను నాదృష్టిలో మ్యాన్​ ఆఫ్​ది సిరీస్​’అందుకోవాల్సింది మీరే సిరీస్​ గెలిచినందుకు భారత్​కు శుభాకాంక్షలు’అని నటరాజన్​, టీమిండియా ఫోటోలతో హార్ధిక్​ ట్వీట్​ చేశారు. రెండో టీ20లో హార్థిక్​ మ్యాన్​ఆఫ్ ది మ్యాచ్​ అందుకున్న అనంతరం కూడా నట్టూకే అవార్డు దక్కాల్సిందని పేర్కొన్న విషయం విదితమే. అయితే నటరాజన్​ను ప్రోత్సహిస్తున్నహార్ధిక్​ను నెటిజన్లు పొగడ్తలతో ముంచెతుత్తున్నారు. ఆయన గొప్ప మనస్సును ప్రశంసిస్తూ సామాజిక మధ్యమాల్లో పోస్ట్​లు పెడుతున్నారు. అయితే టీమిండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ సైతం నటరాజన్​కే టీ20 సిరీస్​ ట్రోఫీని అందించడం విశేషం. యువ ఆటగాడిని ప్రోత్సహిస్తున్న తీరు స్ఫూర్తిదాయకంగా ఉందని కోహ్లీని ప్రశంసిస్తున్నారు.