చెన్నై: నివర్ తుఫాన్ తమిళనాడు, పుదుర్చెరిలను వణికిస్తోంది. ఈ తీవ్ర తుఫాన్ కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చెన్నైకి 56 కిలోమీటర్ల దూరంలోని మలప్పురంలో నివర్ తుఫాన్ గంటకు 145 కి.మీ. వేగంతో తీరాన్ని తాకనుంది. కోస్తా ప్రాంతాల్లో రేపటి వరకు అతి భారీ వర్షాలు కురవనున్నాయి ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలతో అప్రమత్తమైన అధికారులు చెన్నై బయట ఉన్న చెంబరంబాక్కమ్ లేక్ నుంచి 1000 క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు. దీని కారణంగా చెన్నై అడియార్ నదిలో వరద ప్రవాహం పెరగనుంది. నదీ పరీవాహక ప్రాంతంలో ఉండే రెండు వేల మందికిపైగా ప్రజలను ఇప్పటికే అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.