‘ఓదెల రైల్వేస్టేషన్’ లుక్ విడుదల

హైదరాబాద్‌ : శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బేన‌ర్‌లో శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో హిట్ చిత్రాల నిర్మాత‌ కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్నడిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ` ఓదెల రైల్వేస్టేష‌న్`. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ అందిస్తున్న ఈ చిత్రం ద్వారా అశోక్ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. కన్నడలో ద‌య‌విట్టు గ‌మ‌నిసి, 8MM బుల్లెట్, ఇండియా vs ఇంగ్లాండ్‌, మాయ‌బ‌జార్ 2016, వంటి హిట్ చిత్రాల‌తో పాటు 25 చిత్రాల‌కు పైగా న‌టించిన వ‌శిష్ట ఎన్. సింహ తెలుగులో హీరోగా న‌టిస్తోన్న మొద‌టి సినిమా ఇది. ప‌ల్లెటూరి అమ్మాయి ‘రాధ’ గా ఒక వైవిద్య‌మైన పాత్ర‌లో హీరోయిన్ హెభా ప‌టేల్ న‌టిస్తోంది. ఇటీవల విడుదల చేసిన హెభా ప‌టేల్ లుక్ కి విశేష స్పందన లభించింది. ‘ఓదెల’ అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఓ వైవిధ్యభరిత క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. మేకప్, డ్రీమ్‌ సీక్వెన్సెస్, పాటలు లేకుండా సినిమాను వాస్తవికతకు దగ్గిరగా రియలిస్టిక్ అప్రోచ్ తో తెరకెక్కించారు. తిరుపతి పాత్రలో నటిస్తున్న హీరో వ‌శిష్ట సింహ లుక్ ను టీం విడుదల చేసింది. బట్టలు ఐరన్ చేస్తూ పక్కా పల్లెటూరి యువకుడి లుక్ తో ఉన్న వ‌శిష్ట సింహ పోస్టర్ ను విడుదల చేశారు. సాధారణ యువకుడిగా అందరికీ సహాయపడే క్యారెక్టర్ లో ఆయన కనిపిస్తారు. 'ఓదెల రైల్వేస్టేషన్' లుక్ విడుదల

వ‌శిష్ట‌సింహ‌, హెబా ప‌టేల్, సాయిరోన‌క్, పూజితా పొన్నాడ‌, నాగ‌మ‌హేష్‌(రంగ‌స్థ‌లం ఫేమ్‌), భూపాల్‌, శ్రీ‌గ‌గ‌న్, దివ్య సైర‌స్‌, సురేంద‌ర్ రెడ్డి, ప్రియా హెగ్దె త‌దిత‌రులు న‌టిస్తోన్నఈ చిత్రానికి

సినిమాటోగ్ర‌ఫి: ఎస్. సౌంద‌ర్ రాజ‌న్‌,
సంగీతం: అనూప్ రూబెన్స్,
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు,
ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌,
స‌మ‌ర్ఫ‌ణ‌: శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్,
నిర్మాత‌: కె.కె.రాధామోహ‌న్,
క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే: స‌ంప‌త్‌నంది,
ద‌ర్శ‌క‌త్వం: అశోక్ తేజ‌.