అక్కడ మరోసారి లాక్ డౌన్ తరహా నిబంధనలు

అక్కడ మరోసారి లాక్ డౌన్ తరహా నిబంధనలుఢిల్లీ : ఢిల్లీలో మరోసారి లాక్ డౌన్ తరహా నిబంధనలు విధించారు. ఈ సారి కారణం మాత్రం కరోనా కాదు. కాలుష్యం కారణమైంది. దీంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వారం పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆన్ లైన్ ద్వారా పాఠాలు చెప్పేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే ఈ నెల 17న భవన నిర్మాణ కార్యకలాపాలను కూడా నిలిపివేయాలని ఆదేశించారు. ఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేయాలని ఆదేశించారు. లాక్ డౌన్ పై కూడా ఆలోచిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ చర్యల వల్ల వాహనాల రద్దీ తగ్గి కాలుష్యం తగ్గే అవకాశం ఉండటంతో ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.