జనసేనాని తెలంగాణ పర్యటనలో అపశృతి

జనసేనాని తెలంగాణ పర్యటనలో అపశృతి

జనసేనాని తెలంగాణ పర్యటనలో అపశృతి

వరంగల్ టైమ్స్, కరీంనగర్ జిల్లా : కొండగట్టు, ధర్మపురి పర్యటన పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్ తిరిగి బయల్దేరగా, ఆయన కాన్వాయ్ ను కొంత మంది అభిమానులు ఫాలో అయ్యారు. పవన్ కాన్వాయ్ వెంట వెళ్తూ తమ అభిమాన నేతకు అభివాదం చేసే ప్రయత్నం చేసి నలుగురు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో తలకు తీవ్ర గాయమై ఒక యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ధర్మపురి ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రెండు బైకులు ఢీకొట్టుకోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తలలు పగిలి, తీవ్ర రక్తస్రావమై ఘటనా స్థలి ఒకింత భయానకంగా ఉంది.