ఛత్తీస్‌గఢ్ ఎదురు కాల్పుల్లో ఓ నక్సల్‌ హతం

బిజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మారోసారి తుపాకులు గర్జించాయి. బిజాపూర్‌ జిల్లా కుత్రు పోలీస్‌ స్టేషన్‌లో పరిధిలోని దర్భా అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఓ నక్సల్‌ హతమైనట్లు బస్తర్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఐజీ) పీ సుందర్‌రాజ్‌ తెలిపారు. ఘటనా స్థలంలో మావోయిస్టు మృతదేహంతోపాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మరిన్ని విషయాలు తరువాత వెల్లడిస్తామని చెప్పారు.