అప్పట్లో 20 మద్యం బ్రాండ్లకు అనుమతి

అప్పట్లో 20 మద్యం బ్రాండ్లకు అనుమతి

వరంగల్ టైమ్స్, అమరావతి : రాష్ట్రంలో 2019-20లో 20 మద్యం బ్రాండ్లకు అనుమతిచ్చామని ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ వెల్లడించారు. తర్వాత ఏ బ్రాండుకూ అనుమతివ్వలేదని చెప్పారు. ప్రస్తుతం 76 మంది సరఫరాదారులకు చెందిన 300 మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అప్పట్లో 20 మద్యం బ్రాండ్లకు అనుమతి2020-21 మధ్య రాష్ట్రంలో 1.55 లక్షల మద్యం నమూనాలను పరీక్షించామని, వాటిలో ప్రాణాంతకమైనవి ఏమీ లేవని తేలిందని ప్రకటించారు. మొత్తం బ్రాండ్లలో వేటికి ఎప్పుడు అనుమతిచ్చారో జాబితా ఇవ్వాలని విలేకరులు అడిగిన ప్రశ్నలకు దాటవేత ధోరణితో సమాధానం ఇచ్చారు. 2019 ఫిబ్రవరి తర్వాత కొత్తగా ఒక్క డిస్టిలరీ ఏర్పాటుకూ అనుమతివ్వలేదన్నారు. ఉన్న వాటిలో ఏవైనా చేతులు మారాయా? అనే విషయం వెల్లడించలేదు.