చెక్ బౌన్స్ కేసులో హీరో సుమంత్ కోర్టుకు హాజరు

చెక్ బౌన్స్ కేసులో హీరో సుమంత్ కోర్టుకు హాజరుమార్కాపురం: చెక్కు బౌన్స్ కేసు నిమిత్తం సినీ నటులు సుమంత్, ఆయన చెల్లెలు సుప్రియ లు గురువారం మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు. మాచర్ల కు చెందిన కారుమంచి శ్రీనివాసరావు నరుడా డో నరుడా చిత్రానికి నిర్మాత వ్యవరిస్తున్న సుప్రియ కు పెట్టుబడి పెట్టారు. ఇందుకు గాను అ చిత్ర హీరో సుమంత్, నిర్మాతగా వున్న ఆయన చెల్లెలు సుప్రియ లు ఇద్దరు జాయింట్ అక్కౌంట్ తో సినిమా ఇన్వెస్టర్ కారుమంచి శ్రీనివాసరావు కు ఇవ్వాల్సిన బాకీ నిమిత్తం చెక్కు ఇవ్వడం జరిగింది.

అయితే శ్రీనివాసరావు చెక్ ను బ్యాంకు లో ప్రజెంట్ చేయగా బౌన్స్ అయ్యింది. దింతో కారుమంచి మార్కాపురం కోర్టులో కేసు వేయగా విచారణ నిమిత్తం గురువారం హీరో సుమంత్, నిర్మాత సుప్రియ లు హాజరయ్యారు. సుమంత్ స్వయానా ప్రముఖ అగ్ర హీరో నాగార్జున మేనల్లుడు అయిన విషయం తెలిసిందే.