నేడు ప్రొ.జయశంకర్ ‌సార్‌ జయంతి

నేడు ప్రొ.జయశంకర్ ‌సార్‌ జయంతిహైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమ భావజాలవ్యాప్తికి జీవితాంతం కృషిచేసిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ సదాస్మరణీయుడని సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం జయశంకర్‌సార్‌ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకొన్నారు. ఆచార్య జయశంకర్‌ ఆశించిన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, అన్నిరంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. జయశంకర్‌ జయంతిని తెలంగాణభవన్‌లో ఘనంగా నిర్వహించారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతుబంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, ఏ వెంకటేశ్వర్‌రెడ్డి, వీ ప్రకాశ్‌, కే వాసుదేవరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శులు తుల ఉమ, బండి రమేశ్‌, శివకుమార్‌, కార్యదర్శి గట్టు రామచందర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబుయాదవ్‌ పాల్గొన్నారు.