కేటీఆర్ కు విషెష్ చెప్పిన పువ్వాడ అజయ్
దావోస్ పర్యటన సక్సెస్ పట్ల కేటీఆర్ కు పువ్వాడ విషెష్
ఖమ్మం బహిరంగ సభ సక్సెస్ తో పువ్వాడను అభినందించిన కేటీఆర్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ బీఆర్కే భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో భాగంగా దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి 21000 కోట్ల పెట్టుబడులు వచ్చిన సందర్భంగా కేటీఆర్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే భారీ జన సమీకరణతో బీఆర్ఎస్ పార్టీ తొలి బహిరంగ సభ ఖమ్మంలో విజయవంతమైన సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నుమంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మంత్రి అజయ్ కుమార్ తన అన్న కుమారుడు పువ్వాడ నరేన్ వివాహ రిసెప్షన్ కు ఫిబ్రవరి 10 హాజరుకావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేసి సాదరంగా ఆహ్వానించారు.