రాక్షస పాలన అంతం కోసం వారాహి : పవన్

రాక్షస పాలన అంతం కోసం వారాహి : పవన్ కళ్యాణ్

రాక్షస పాలన అంతం కోసం వారాహి : పవన్

వరంగల్ టైమ్స్, విజయవాడ : రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, రాక్షస పాలన అంతం కావాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యమని ఆయన ధిక్కరించి చెప్పారు. కొండగట్టులో ప్రత్యేక పూజలు, వారాహికి వాహన పూజల అనంతరం జనసేనాని సైన్యం వారాహి ప్రచార రథంతో విజయవాడకు ర్యాలీగా వెళ్లింది. ర్యాలీలో భాగంగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వ పాలనా తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యమని ఆయన తెలిపారు.

అంతకుముందు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ లు దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఈఓ భ్రమరాండ, ఆలయ అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని అంతరాలయం గుండా దర్శించుకున్న పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు, పండ్లు సమర్పించారు. పవన్ కళ్యాణ్ కు ఆలయ ఆవరణలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అమ్మవారి దర్శన భాగ్యం ఎంతో అదృష్టమని పవన్ అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు పవన్ కళ్యాణ్, మనోహర్ లు తెలిపారు. అనంతరం ఇంద్రకీలాద్రి కింద జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.