వలస కార్మికులకు విమానం బుక్ చేసిన సోనూ

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. ప్రస్తుతం నటుడు సోనూసూద్ అంటే వలస కూలీల పాలిట ఓ హీరో.

వలస కార్మికులకు విమానం బుక్ చేసిన సోనూ

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. ప్రస్తుతం నటుడు సోనూసూద్ అంటే వలస కూలీల పాలిట ఓ హీరో. అన్నా.. మేం ఫలానా చోట చిక్కుకుపోయాం అని అతడికి సమాచారం అందిస్తే చాలు ఎలాగైనా వారిని ఇంటికి చేరుస్తూ వారి పాలిట దైవంలా మారుతున్నాడు. వలస కూలీలను ప్రత్యేక బస్సుల్లో వారి సొంత గ్రామాలకు చేరుస్తున్నాడు. ఈ క్రమంలో సోనూ సూద్ ను సోషల్ మీడియా పొగడ్తల్లో ముంచెత్తుతోంది. కాగా.. తాజాగా సోనూసూద్ చేసిన పని చూసి మరింత ముక్కున వేలు వేసుకోవాలి. ఎందుకంటే, వలస కూలీలను సొంత గ్రామాలకు చేర్చడం కోసం అతడు ఏకంగా ఓ విమానాన్ని ఏర్పాటు చేశాడు. కేరళలోని ఎర్నాకుళంలో కుట్టుమిషన్ల కంపెనీలో పనిచేస్తున్న 177 మంది మహిళలు తమ సొంత రాష్ట్రం ఒడిశాకు వెళ్లాలంటూ సోనూసూద్‌ను సాయం కోరారు. ఆ విషయం తెలిసిన వెంటనే వారి కోసం ఓ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశాడు.

మరోవైపు.. సోనూ సూద్‌కు తెలిసిన నీతి గోయల్ అనే వ్యక్తి ద్వారా కేరళ, ఒడిశా ప్రభుత్వాలతో మాట్లాడి కొచ్చి, భువనేశ్వర్ విమానాశ్రయాల్లో విమానం ఎక్కి, దిగే ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు సోనూసూద్ ప్రత్యేకంగా బుక్ చేసిన ఎయిర్ ఏసియా విమానం బెంగళూరు నుంచి కోచి వెళ్లింది. అక్కడి నుంచి 177 మంది మహిళలను తీసుకుని భువనేశ్వర్‌లో దింపింది. ఆ తర్వాత వారు అక్కడి నుంచి కేంద్రపార జిల్లాలో తమ తమ సొంత గ్రామాలకు వెళ్లే ఏర్పాట్లు కూడా చేశారు.