జీ స్టూడియోకు దక్కిన సోలో బ్రతుకే సో బెట‌ర్‌’

సోలో బ్రతుకే సో బెట‌ర్‌’ పంపిణీ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న జీ స్టూడియో….డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌జీ స్టూడియోకు దక్కిన సోలో బ్రతుకే సో బెట‌ర్‌’హైదరాబాద్‌: సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ సుబ్బు ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ఎంటర్‌టైనర్ ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని మ‌రో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియో అసోసియేష‌న్‌తో డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేస్తున్నారు. న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. సాయితేజ్‌, న‌భాన‌టేశ్ సూప‌ర్బ్ పెర్ఫామ‌ర్స్ న‌టించిన ఈ ప‌వ‌ర్ ప్యాక్‌డ్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతాన్ని అందిచారు. ఇప్ప‌టికే విడుద‌లైన మూడు పాట‌లు, థీమ్ వీడియోకు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ అయ్యాయి. వెంక‌ట్ సి.దిలీప్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు.

 

న‌టీన‌టులు:
సాయితేజ్‌, న‌భా న‌టేశ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: సుబ్బు
నిర్మాత‌: బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌
ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌
ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి
సంగీతం: త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: వెంక‌ట్ సి.దిలీప్‌