ఐసెట్‌ కౌన్సె‌లింగ్‌ షెడ్యూ‌ల్‌ వాయిదా

ఐసెట్‌ కౌన్సె‌లింగ్‌ షెడ్యూ‌ల్‌ వాయిదా

హైద‌రా‌బాద్: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కళా‌శా‌లల్లో ప్రవే‌శా‌లకు చేప‌ట్టిన తెలంగాణ ఐసెట్‌ కౌన్సె‌లింగ్‌ షెడ్యూ‌ల్‌ను వాయిదా పడింది. కౌన్సె‌లింగ్‌ కేంద్రాల్లో కూడా జీహె‌చ్‌‌ఎంసీ పోలింగ్‌ కేంద్రాలుపెట్టడంతో అధి‌కా‌రులు ఈ నిర్ణయం తీసు‌కు‌న్నట్టు తెలి‌సింది. ఎన్ని‌కలు ముగి‌సిన వెంటనే కౌన్సె‌లింగ్‌ ప్రారం‌భిం‌చేలా షెడ్యూల్‌ విడు‌ద‌ల‌చే‌సే అవ‌కాశం ఉన్న‌ది. ప్రస్తుతం ఎంసెట్‌ (బై‌పీసీ) కౌన్సె‌లింగ్‌ కొన‌సా‌గు‌తు‌న్నది. ఈ నెల 23తో ఆ ప్రక్రియ ముగి‌య‌నుంది.