ప్రేమ పెళ్లి..ఆపై యువకుడి దారుణ హత్య

ప్రేమ పెళ్లి..ఆపై యువకుడి దారుణ హత్య

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ప్రేమ వివాహం చేసుకున్నందుకు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రేమించి పెళ్లిచేసుకుని 3 నెలలు గడవక ముందే ఇలా హత్యకు గురికావడంతో నవ వధువు కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. ప్రేమ వివాహం చేసుకున్నందుకు నవ వధువు కుటుంబ సభ్యులు వరుడు బిల్లాపురం నాగరాజును దారుణంగా హత్య చేశారు. రాత్రి 9 గంటల సమయంలో కొత్తపేట – సరూర్ నగర్ ప్రధాన రహదారిపై బెదిరింపులకు పాల్పడి హత్య చేసినట్లు భార్య సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా మరియు స్థానికులు తెలిపారు.

సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్, సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేపట్టడం జరిగింది. పోలీసులు మరియు స్థానికుల కథనం ప్రకారం.. ఓ కార్ల షో రూమ్ లో సేల్స్ మేన్ గా పనిచేసే బిల్లా పురం నాగరాజు (25), సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా (23) జనవరి 31వ తేదీన లక్ష్మి నగర్ లోని ఆర్యసమాజ్ లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి ఇష్టప్రకారమే ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. ఐతే సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా కుటుంబ సభ్యులు వివాహానికి అడ్డు చెప్పినట్లు సమాచారం.