ప్రధాని మోదీని కలిసిన సత్యనాదెళ్ళ

ప్రధాని మోదీని కలిసిన సత్యనాదెళ్ళ

ప్రధాని మోదీని కలిసిన సత్యనాదెళ్ళవరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. డిజిటలైజేషన్​ ద్వారా సుస్థిరమైన, సమ్మిళిత ఆర్థిక వృద్ధిని సాకారం చేసుకునే విషయంలో ప్రభుత్వానికి ఉన్న దూరదృష్టి స్ఫూర్తిదాయకంగా ఉందని సత్యనాదెళ్ల అన్నారు. భారత్​ తన డిజిటల్​ ఇండియా విజన్​ను సాకారం చేసుకుని ప్రపంచానికి ఓ దివిటీలా మారడంలో సహాయం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము” అని సత్య నాదెళ్ల ట్వీట్​ చేశారు. లోతైన అవగాహనతో జరిగిన ఈ సమావేశానికి కారణమైన ప్రధాని నరేంద్ర మోడీకి సత్యనాదెళ్ల ధన్యవాదాలు తెలిపారు.