హైదరాబాద్: హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా వర్గో పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కుతోన్న చిత్రం `సెహరి`. సంగీత దర్శకుడు కోటి కీలక పాత్ర పోషిస్తున్నఈ చిత్రాన్నిజ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మిస్తున్నారు. నవంబర్ 16 హీరో హర్ష్ కనుమిల్లి పుట్టిన రోజు సందర్భంగా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నటసింహ సందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై `సెహరి`ఫస్ట్ లుక్ పోస్టర్‌ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ సిమ్రాన్ చౌదరి, నటులు అభినవ్ గోమటం, ప్రనీత్ కళ్లెం తదితరులు పాల్గొన్నారు.
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి, కోటి, బాలకృష్ణ (సీనియర్ యాక్టర్), అభినవ్ గోమటం, ప్రనీత్ కళ్లెం, అనీషా అల్ల, అక్షిత శెట్టి, రాజేశ్వరి, శ్రిస్తి, యశ్వంత్, అనీల్ కుమార్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి
సాంకేతిక వర్గం.
బ్యానర్: వర్గో పిక్చర్స్
దర్శకత్వం: జ్ఞానసాగర్ ద్వారక
నిర్మాతలు: అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి
ప్రొడక్షన్ డిజైనర్: మేఘన కనుమిల్లి
సినిమాటోగ్రఫి: సురేష్ సారంగం
సంగీతం: ప‌్రశాంత్ ఆర్. విహారి
ఎడిటర్: రవితేజ గిరిజల
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్,
కథ: హరీష్ కనుమిల్లి,