సోనుసూద్ పై వెలకట్టలేని అభిమానం

సోనుసూద్ పై వెలకట్టలేని అభిమానంసిద్దిపేట జిల్లా: లాక్ డౌన్ సమయంలో వలసకార్మికులకు బాసటగా నిలిచి దేశం గర్వించే విధంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న బాలీవుడ్ నటుడు సోను సూద్ విగ్రహాన్ని మారుమూల గిరిజన తండాలో ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు దూల్మిట్ట మండల పంచాయతీ పరిధిలోని చెలిమి తండా వాసులు. సోనుసూద్ మీద ఉన్న అభిమానంతో చెలిమి తండాకు చెందిన భూక్య రాజేష్ రాథోడ్ అనే యువకుడు..అదే తండాకు చెందిన కొంత మంది యువకులు చందాలు వేసుకొన్నారు. కూడగట్టుకున్న చందాలతో సోను సూద్ కు కృతజ్ఞతగా తండా నడిబొడ్డున ఒక షెడ్డును ఏర్పాటు చేసి ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రతిష్టించిన సోనుసూద్ విగ్రహాన్ని జెడ్ పి టి సి గిరి కొండల్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం గిరిజన మహిళలు తన సంప్రదాయ నృత్యాలతో సోనూసూద్ విగ్రహం వద్ద సందడి చేశారు. దేశంలో ఎంత మంది కోటీశ్వర్లు ఉన్నా కరోన సమయంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న దేవుడంటూ తను చేసిన సేవా కార్యక్రమాలను తండా వాసులు, విగ్రహదాతలు కొనియాడారు. దేశంలో అందరి అభిమానాన్ని సంపాందించుకున్న సోనుసూద్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తమకెంతో సంతోషంగా వుందని అంటున్నారు తండా యువకులు.