సూర్య హీరోగా `వాడివాసల్‌`

 సింగం సూర్య హీరోగా వెట్రిమారన్‌ ద‌ర్శ‌క‌త్వంలో క‌లైపులి ఎస్. థాను సెన్సేష‌న‌ల్ మూవీ `వాడివాసల్‌`.

సూర్య హీరోగా `వాడివాసల్‌`
హైదరాబాద్ : సింగం సూర్య హీరోగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వెట్రిమారన్‌ ద‌ర్శ‌క‌త్వంలో క‌లైపులి ఎస్. థాను నిర్మిస్తున్న చిత్రం ‘వాడివాసల్‌. హీరో సూర్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల‌చేసిన ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ధ‌నుష్, క‌లైపులి ఎస్. థాను, వెట్రిమారన్ కాంభినేష‌న్‌లో వ‌చ్చిన అసుర‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో నార‌ప్ప‌గా తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పుడు ప్ర‌ముఖ ర‌చ‌యిత సీఎస్‌ చెల్లప్ప రాసిన నవల ఆధారంగా జల్లికట్టు నేపథ్యంలో వాడివాసల్ చిత్రం తెరకెక్కనుంది. సూర్య, వెట్రిమారన్‌ కాంభినేష‌న్‌లో ప్ర‌స్టీజియ‌స్‌గా రూపొందుతోన్న ఈ మూవీ మా బేన‌ర్‌లో మ‌రో సెన్సేష‌న‌ల్ సినిమా కాబోతుంద‌ని నిర్మాత క‌లైపులి ఎస్. థాను అన్నారు. ఈ సినిమాకు సంబందించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్నారు. సింగం సూర్య హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: ఆర్‌. వేల్‌రాజ్‌, సంగీతం: జి.వి. ప్ర‌కాశ్‌, ఆర్ట్‌: జాకీ, నిర్మాత‌: క‌లైపులి ఎస్. థాను, ద‌ర్శ‌క‌త్వం: వెట్రిమారన్.