తెలంగాణ ఆణిముత్యం కేటీఆర్: దాస్యం

వరంగల్ అర్బన్ జిల్లా: టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 44వ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ లో ఘనంగా నిర్వహించారు. హన్మకొండ బాలసముద్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మికుల సంఘం టిఆర్వికేఎస్ సహకారంతో విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు , సినిమా ధియేటర్ లలో పనిచేసే కార్మికులకు నిత్యావసర సరుకులతో పాటు రెయిన్ కోట్లు, గ్లౌజులు, మాస్కులు , పంపిణీ చేశారు. తెలంగాణ ఆణిముత్యం కేటీఆర్: దాస్యంఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన కేటీఆర్‌ యువతకు ఆదర్శమని అన్నారు. పురపాలక శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అవిరళ కృషి చేస్తున్నారని దాస్యం వినయ్ భాస్కర్ కొనియాడారు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం వదిలి పెట్టి , తన తండ్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పడుతున్న తపనను చూసి, తాను కూడా ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ పోరాటంలో దిగి, ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజాసమస్యలపై ప్రజాక్షేత్రంలోనే కాకుండా సామాజిక మాద్యమాల ద్వారా చురుగ్గా స్పందిస్తూ ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపుతున్న నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు. యువతలో నైపుణ్యాన్ని పెంపొందిస్తూ, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తూ పెట్టుబడులకు నెలవుగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నాని తెలిపారు . తన తండ్రి కేసీఆర్ గారి ఆశయాలను అమలు చేస్తూ, తండ్రి కి తగ్గ తనయుడుగా, చేనేతకు అండగా, యువతకు స్పూర్తిగా నిలుస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ తెలంగాణకు దొరికిన ఆణిముత్యంగా దాస్యం పేర్కొన్నారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన స్నేహితులు ఇచ్చిన ‘గిఫ్ట్ ఎ స్మైల్ చాలెంజ్’ ను అనుసరించి సహాయార్థులకు ఎంతో కొంత సహాయం చేయాలనే ఆలోచనతో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ప్రతినిధులు జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.