సింగర్ సునీత పెళ్లి వాయిదా..!

సింగర్ సునీత పెళ్లి వాయిదా..!హైదరాబాద్: పలు ఇంటర్వ్యూలలో రెండో పెళ్లి చేసుకోనని చెప్పిన సింగర్ సునీత రీసెంట్ గా తన పిల్లలు, తల్లిదండ్రుల కోరిక మేరకు మళ్లీ పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి ఆశ్చర్యపరిచింది. అనుకున్నట్లుగానే ఇటీవల తన స్నేహితుడు, డిజిటల్ మీడియా వ్యాపారవేత్త అయిన రామ్ తో నిశ్చితార్థం జరుపుకొని అందరికీ షాక్ ఇచ్చింది. అయితే డిసెంబర్ 27న వీరిద్దరి వివాహం డెస్టినేషన్ వేడుకగా జరుగనుందని పలు వార్తలు రాగా, ఇప్పుడు వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఇందుకు గల కారణాలు తెలియాల్సి వుంది.