శాసనమండలిలో రసాభాస

శాసనమండలిలో రసాభాసబెంగుళూరు : గోవధ నిషేధ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో కర్ణాకట శాసనమండలి సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. కాంగ్రెస్​ ఎమ్మెల్సీలు మండలి డిప్యూటీ చైర్మన్​ భోజెగౌడను కుర్చీలో నుంచి లాగారు. బీజేపీ మండలి చైర్మన్​ కే ప్రతాపచంద్ర శెట్టిపై ఆవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో అధికార, కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆయన సభకు వచ్చే ముందు జేడీఎస్​కు చెందిన ఎమ్మెల్సీ, డిప్యూటీ చైర్మన్​ ఎస్​ఎల్​ ధర్మేగౌడను చైర్మన్​ సీటులో కూర్చోబెట్టారు. దీంతో రాజ్యాంగం ప్రకారం ఆయనకు చైర్​లో కూర్చునే అర్హత లేదని తమ పార్టీకి చెందిన చంద్రశేఖర్​ పాటిల్​ను ఆస్థానంలో కూర్చోబెట్టాలని వాదనకు దిగారు. అనంతరం ధర్మేగౌడను కుర్చీలో నుంచి లాగారు. ఈ క్రమంలో మండలిలోకి వచ్చిన చైర్మన్​ ప్రతాపచంద్రశెట్టి సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.​ ఇదిలా ఉండగా ఈనెల 7 నుంచి తిరిగి మండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి.