రైతుబంధు,యాసంగి సమాచారం

రైతుబంధు,యాసంగి సమాచారం

హైదరాబాద్​: యాసంగి 2020 కు గాను రైతుబంధు మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ విడుదల చేసింది.
10.12.2020 వరకు ధరణి లో నమోదైన భూ వివరాలను సీసీఎల్​ఏ ద్వారా రైతు బంధుకు వ్యవసాయ శాఖ తీసుకుంది. కావున తేదీ 10.12.2020 వరకు కొత్త పాస్​బుక్​ల్లో ఎమ్మార్వో చేత సంతకమైన కాపీ పొందిన రైతులు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తు చేసుకోని రైతులు 16/12/2020 నుంచి 19/12/2020 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గడువులోపు దరఖాస్తు చేసుకున్న రైతులకే రైతుబంధు లబ్ది చేకూరుతదని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.
దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలు

1 .అప్లికేషన్ ఫారం
2. పట్టాదారు పాస్​బుక్​ / ఎమ్మార్వో ఆఫీస్ కాపీ
3. ఆధార్ కార్డు జిరాక్స్
4. బ్యాంక్ అకౌంట్ జిరాక్స్.

నోట్​ (1) : గతంలో రైతుబంధు లబ్ధిదారులు అయి వుండి ఒకవేళ బ్యాంక్ వివరాలు మార్పు చేయాలనుకున్న రైతులు కొత్త మరియు పాత బ్యాంక్ వివరాలు ఆదజేయాలి
నోట్​ (2): ఒకవేళ గతంలో దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందుతున్న రైతులు మళ్లీ దరఖాస్తు చేసునోనవసరంలేదని వ్యవసాయశాఖ తెలిపింది..