ఏసీబీకి చిక్కిన సైట్ ఇంజనీర్

ఏసీబీకి చిక్కిన సైట్ ఇంజనీర్నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విద్యాశాఖ సైట్ ఇంజనీర్ స్వామి నాయక్ ఏసీబీ వలలో చిక్కారు. గుత్తేదారు నుంచి రూ.80 వేలు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. ఆశ్రమ పాఠశాలలో నీటి సంపు నిర్మాణం జరిపిన గుత్తేదారు నుంచి రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా తెలంగాణ విద్యా శాఖ మౌలిక సౌకర్యాల అభివృద్ధి కార్పొరేషన్ సైట్ ఇంజినీర్ ఇస్లావత్ స్వామి నాయక్ ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.