టీఆర్​ఎస్​ను అతిపెద్ద పార్టీగా ప్రజలు ఆశీర్వదించారు

టీఆర్​ఎస్​ను అతిపెద్ద పార్టీగా ప్రజలు ఆశీర్వదించారుహైదరాబాద్: టీఆర్​ఎస్​ను గ్రేటర్​ ప్రజలు అతిపెద్ద పార్టీగా ఆశీర్వదించారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థులు శనివారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ,ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్​ తో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ని హైదరాబాద్ లోని ఆయన నివాసం లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు గెలిచిన అభ్యర్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్​ మంత్రి కేటీఆర్​ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్​ నియోజకవర్గంలో గ్రేటర్​ ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు.. అలాగే మంత్రి మల్లారెడ్డి , ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఎమ్మెల్యేలు బాజి రెడ్డి గోవర్ధన్, పెద్ది సుదర్శన్ రెడ్డి, జీవన్ రెడ్డి , హనుమంత్ షిండే కేపీ వివేకానంద్ , డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి నాయకులు పోచారం సురేందర్ రెడ్డి సమష్టి కృషితో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అఖండ విజయం సాధించిందని తెలిపారు. టీఆర్ఎస్​కు ఓటు వేసి ప్రజలకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రచార సమయాల్లో ప్రజలు వివిధ సమస్యలను తమ దృష్టికి తెచ్చారని ఈ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చూపుతామని అన్నారు. గత ఆరేండ్లలో ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేసిందో అదే తరహాలో రాబోయే రోజుల్లో నగర అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని అన్నారు.