సీలేరులో స్వల్ప భూప్రకంపనలు

విశాఖ:  ఉదయం 11 గంటల సమయంలో సీలేరు లో ఒక్కసారిగా భూమి కంపించింది. అదే సమయంలో పెద్దగా శబ్దం రావడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందా అని అనుకునే లోపే ప్రకంపనలు నిలిచిపోయాయి. అయినప్పటికీ స్థానికులు భయాందోళనలతో బయటికి పరుగులు తీశారు. స్థానిక ఎస్ ఈ వద్ద, జెన్కో అపార్ట్మెంట్ల వద్ద శబ్దము పెద్దగా వినిపించింది.ఈ సంఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.