శ్రీశైలం మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం నిలిపివేత

శ్రీశైలం మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం నిలిపివేత

వరంగల్ టైమ్స్, డెవోషనల్ డెస్క్ : నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 19 నుంచి 23 వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నందున ఆ రోజుల్లో మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనాన్ని నిలిపివేయనున్నట్లు దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న తెలిపారు. భక్తులందరికీ అలంకార దర్శనం కల్పిస్తామన్నారు. ఈ నెల 9 నుంచి 18 వరకు నిర్దిష్ట వేళల్లో నాలుగు విడతల్లో భక్తులకు స్పర్శ దర్శనం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఈ టికెట్‌ ధరను రూ.500గా నిర్ణయించామని, ఒక్కో విడతలో 1500 టికెట్లు మాత్రమే ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.