దానిమ్మతో అధికరక్తపోటుకు చెక్ పెట్టొచ్చు..!
వరంగల్ టైమ్స్, హెల్త్ డెస్క్ : భారతదేశంలో కనిపించే అత్యంత సాధారణ పండ్లలో దానిమ్మ ఒకటి. ఇది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనకు తెలుసు. “దానిమ్మ ఒక శక్తివంతమైన యాంటీ-అథెరోజెనిక్ ఏజెంట్. ఇందులో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇది ధమనులను క్లియర్ చేయడంలో, రక్తపోటును తగ్గించడంలో, గుండెను రక్షించడంలో, రక్తనాళాలు మూసుకుపోకుండా చేయడంలో సహాయపడుతుంది. మూడు నెలల పాటు రోజుకు మూడు దానిమ్మ పండ్లు తినండి. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు అధికరక్తపోటును కూడా అదుపులో ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
* జీవనశైలి, ఆహారంలో ఈ మార్పులు చేయండి
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మూడు దానిమ్మ పళ్లు తింటే సరిపోదు. రక్తపోటును తగ్గించడానికి, ధమనులను ఆరోగ్యంగా ఉంచడానికి జీవనశైలిలో మార్పులు కూడా అవసరం. మీరు కొలెస్ట్రాల్ , రక్తపోటు స్థాయిలను నియంత్రణలో ఉంచుకున్నప్పుడే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
– ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి. రొట్టె, పాస్తాకు బదులుగా తృణధాన్యాలు తినండి.
– పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
– ఆహారంలో కొలెస్ట్రాల్ తగ్గించే ఆహారాలను తీసుకోండి. పాలు, వెన్న, చీజ్ మొదలైన వాటిని తీసుకోవడం తగ్గించండి.
– ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవడానికి నట్స్, ఆలివ్ ఆయిల్, అవకాడోలను ఉపయోగించండి.
– ప్రాసెస్ చేసిన ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు ఉంటాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండండి.
– ఉప్పు తక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు పెరుగుతుంది.
– ఆల్కహాల్ కు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇందులో చాలా కేలరీలు ఉంటాయి. ఇది బరువును పెంచుతుంది.
– ధూమపానం వదిలేయండి.