చంద్రబాబుతో సూపర్ స్టార్ రజినీకాంత్ భేటీ

చంద్రబాబుతో సూపర్ స్టార్ రజినీకాంత్ భేటీ

చంద్రబాబుతో సూపర్ స్టార్ రజినీకాంత్ భేటీ

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడిని కలిశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సోమవారం భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీకి సంబంధించిన ఫోటోను చంద్రబాబు ట్విట్టర్ లో షేర్ చేశారు. ” నా ప్రియమైన స్నేహితుడు తలైవా రజనీకాంత్ ను కలిసి, ముచ్చటించడం చాలా ఆనందంగా ఉంది” అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

దీంతో కొద్ది నిమిషాల్లోనే ఆ ఫోటో వేల లైక్స్, రీ ట్వీట్ లతో వైరల్ గా మారింది. అయితే ‘వీరిద్దరూ ఎప్పటినుంచో మంచి స్నేహితులు’ అని కొందరు నెటిజన్లు సంబంధిత ఫోటోలతో నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు. మరికొందరు రాజకీయ కోణంలో చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ నిన్న జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ , తాజాగా రజనీకాంత్ తో చంద్రబాబు నాయుడు సమావేశం కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.