బాలుడిని తల్లి ఒడికి చేర్చిన టెక్నాలజీ

టెక్నాలజీ సాయంతో తప్పిపోయిన బాలుడున్ని తల్లి వద్దకు చేర్చిన జఫర్ గడ్ పోలీసులు

బాలుడిని తల్లి ఒడికి చేర్చిన టెక్నాలజీజనగామ జిల్లా: యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నాజరీన్ తన కుమారుడు అక్బర్ తో కల్సి ఈ మద్యాహ్నం జఫర గడ్ మండల కేంద్రంలోని తమ బంధువుల ఇంటికి చేరుకున్నారు. కొంతసేపు అడుకోనేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన బాలుడు కనిపించక పోవడంతో కంగారు పడ్డ తల్లి చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ఆచూకి కోసం ప్రయత్నించింది. చివరకు తన కొడుకు అచూకి తెలియకపోడంతో పాటు భువనగిరికి తిరిగి వెళ్ళి వుంటాడనే అనుమానంతో తల్లి భువనగిరికి తిరిగి వెళ్లింది. జఫర్ గడ్ మండల కేంద్రంలో బాలుడు అక్బర్ మండల కేంద్రంలో తిరుగుతూ.. స్థానికులకు కనిపించడంతో బాలుడుని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. బాలుడుని అక్కున చేర్చుకున్న పోలీసులు బాలుడు ఇచ్చిన సమాచారంతో జఫర్ గడ్ ఎస్ఐ కిషోర్ తక్షణమే స్పందించి బాలుడి తల్లి సెల్ ఫోన్ నంబర్ అధారంగా ప్రస్తుతం పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీ ని వినియోగించుకోని, వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఐటీ కోర్ విభాగం సహకారంతో సదరు బాలుడి తల్లి అచూకీ కనుగోన్నారు. అనంతరం అమెను ఎస్ఐ కిషోర్ తన వాహనంలో పోలీసు స్టేషన్ కు రప్పించి తప్పిపోయిన తన కొడుకును పోలీసులు తల్లికి అప్పగించారు. తప్పిపోయిన తన కుమారుడిని తనకు గంటల వ్యవధిలో తిరిగి అప్పగించినందుకు బాలుడు తల్లి ఎస్ఐ కిషోర్ తోపాటు వారి సిబ్బంది మరియు బాలుడుని పోలీసులకు అప్పగించిన స్థానికులకు కృతజ్ఞతలు తెలియజేసింది.