నిరుపేదలకు టిఆర్ఎస్ అండగా ఉంటుంది: దాస్యం

వరంగల్ అర్బన్ జిల్లా: నిరుపేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. తన జన్మదినోత్సాన్ని పురస్కరించుకుని వరంగల్ పశ్చిమ నియెజకవర్గంలో దాస్యం వినయ్ భాస్కర్ పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. కేటీఆర్ గారి బర్త్ డే సందర్భంగా పిలుపునిచ్చిన “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమంలో భాగంగా తాను అందజేసిన అంబులెన్స్ ను ప్రభుత్వ ప్రసూతి దవాఖాన ఆవరణలో ప్రారంభించారు. నిరుపేదలకు టిఆర్ఎస్ అండగా ఉంటుంది: దాస్యంతర్వాత ఆర్థిక ఇబ్బందులతో, ఆనారోగ్యంతో బాధపడుతున్న వారికి చికిత్స నిమిత్తం ఎల్ఓసి మరియు సీఎంఆర్ ఎఫ్ చెక్కులను బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
నిరుపేదలకు టిఆర్ఎస్ అండగా ఉంటుంది: దాస్యంఅనంతరం చెట్టు-చెక్కు అనే వినుత్న కార్యక్రమంలో భాగంగా నియెజకవర్గానికి చెందిన 14 మంది లబ్ధిదారులకు దాదాపు ఇరవై రెండు లక్షల రూపాయల సీఎం సహాయనిధి చెక్కులతో పాటు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, నాల్ల స్వరూప రాణి, మిడిదొడ్డి స్వప్న , అబూబకర్ మరియు డివిజన్ అధ్యక్షులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.