డా. బిఆర్ అంబేద్కర్ అందరివాడు : పోచారం

డా. బిఆర్ అంబేద్కర్ అందరివాడు : పోచారం

వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : భారతరత్న, రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరివాడని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆ మహనీయుడిని ఒక కులానికి అంటగట్టడం సరికాదని ఆయన పేర్కొన్నారు. డా.బిఆర్ అంబేద్కర్ 131 జయంతి సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి పూల వేసి నివాళులర్పించారు. వీరితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మండలిలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, విజీ గౌడ్, బుగ్గారపు దయానంద్, కాటేపల్లి జనార్దన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, లేజిస్లేటివ్ సెక్రటరీ డా వి నరసింహా చార్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.డా. బిఆర్ అంబేద్కర్ అందరివాడు : పోచారంరాజ్యాంగం రూపొందించేందుకు అంబేద్కర్ విశేష కృషి చేశారని కొనియాడారు. పేదరికాన్ని నిర్మూలించినప్పుడే నిజమైన అభివృద్ధి జరిగినట్లు అని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి దిశలో పయనిస్తోందని, కేసీఆర్ పాలన కొనసాగుతుందన్నారు. ఈ దేశం సీఎం కేసీఆర్ ను కోరుకుంటోందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి లాంటి వారే చెప్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.