దేశానికే ఆదర్శం దళిత బందు : చల్లా  

దేశానికే ఆదర్శం దళిత బందు : చల్లా

వరంగల్ టైమ్స్ , హనుమకొండ జిల్లా : దేశానికే ఆదర్శం దళిత బందు పథకమని పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. దళిత కుటుంబాల ఆర్ధిక అభివృద్ధికి దళిత బందు పథకం ఒక వరం లాంటిదని తెలిపారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131 జయంతి సందర్భంగా పరకాల నియోజకవర్గంలో అంబేద్కర్ కు నివాళులర్పించిన అనంతరం దళిత బంధు లబ్ధిదారులకు వాహనాలను అందించారు. హనుమకొండ జిల్లా పరకాల, పరకాల మున్సిపాటిటీ, నడికూడ, ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన ఆరుగురు దళితబంధు లబ్ధిదారులకు ఎమ్మెల్యే ప్రొసీడింగ్స్ కాపీలను అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన చల్లా ధర్మారెడ్డి, లబ్ధిదారులు లాభదాయకమైన యూనిట్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు.దేశానికే ఆదర్శం దళిత బందు : చల్లా  రాష్ట్రంలోని ప్రతీ దళిత కుటుంబం ఆర్థికంగా పరిపుష్టి సాధించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఈ దళిత బందు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. దళితుల పట్ల సమాజంలో నెలకొన్న వివక్షతను రూపు మాపడమే దళితబందు పథకం ప్రధాన ఉద్దేశ్యమని ఆయన అన్నారు. లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.