ఈ పండ్లు రాత్రిపూట తినకూడదు..!

ఈ పండ్లు రాత్రిపూట తినకూడదు..!

ఈ పండ్లు రాత్రిపూట తినకూడదు..!

వరంగల్ టైమ్స్, హెల్త్ డెస్క్ : మనలో చాలామందికి భోజనం చేసిన తర్వాత పండ్లు తినే అలవాటు ఉంటుంది. ఇంకొంత మంది రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకునే ముందుకు కూడా పండ్లు తింటారు. కానీ ఇలా తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే కొన్ని రకలా పండ్లు రాత్రి పడుకునే ముందు తింటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందట. మరి ఎప్పుడు, ఏ సమయంలో ఎలాంటి పండ్లు తినాలి, తినకూడదో తెలుసుకుందాం.

* యాపిల్ :
రోజుకో యాపిల్ తింటే డాక్టర్ తో అవసరం ఉండదు. కానీ రాత్రి పడుకునే ముందు మాత్రం ఆపిల్ తినకూడదని డాక్టర్లు చెబుతుంటారు. ప్రతీ రోజూ ఒక యాపిల్ తినడం వల్ల గుండె జబ్బులతో సహా అనేక ఇతర వ్యాధులను నివారించవచ్చు. అంతేకాదు శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి రాత్రిపూట కాకుండా ఉదయం పూట మాత్రమే యాపిల్ తినాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే యాపిల్‌లో ఫైబర్ ఉంటుంది. మన శరీరంలో కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేసే శక్తి దీనికి ఉంది. కానీ రాత్రిపూట యాపిల్ తినడం వల్ల మన జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయదు. మనం తినే ఆహారంలో ఇప్పటికే తగినంత ఫైబర్ లభిస్తుంది. యాపిల్‌లో కూడా ఫైబర్ ఉండటం వల్ల గ్యాస్ట్రిక్ , ఎసిడిటీ పెరిగే అవకాశం ఉంటుంది.

* సీజనల్ పండ్లు కూడా ప్రమాదకరం :
రాత్రి పడుకునే ముందు సీజనల్ ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకున్న వారి శరీరంలో యాసిడ్ ఎక్కువగా చేరుతుంది. ఇది గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. నిద్రకు భంగం కలిగిస్తుంది. కాబట్టి అలాంటి పండ్లను రాత్రిపూట తినకూడదు.

* నారింజ, ద్రాక్ష :
ఇవి కొద్దిగా తక్కువ ఆమ్లత్వం కలిగి ఉంటాయి. అయితే రాత్రిపూట భోజనం తర్వాత వీటిని తినకూడదని వైద్యులు చెబుతున్నారు. పండ్లలో ప్రధానంగా విటమిన్ ‘సి’, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వాటిని తిన్న తర్వాత మీకు నిద్ర పట్టడంలో ఇబ్బంది ఉంటే మీకు గ్యాస్ట్రిక్, అసిడిటీ ఉందని అర్థం. మీరు స్వీట్లు తినాలనుకుంటే నారింజ, ద్రాక్షపండ్లు, కివీలను తక్కువ మొత్తంలో తినండి.

* సపోటా పండు :
ఇందులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రాత్రి నిద్రించే సమయంలో సపోటా పండును తింటే మీ శరీరంలో రక్తంలో చక్కెర చాలా పెరుగుతుంది. ఇది మీకు నిద్రలేకుండా చేస్తుంది. కాబట్టి రాత్రిపూట సపోటా పండును తినకూడదు.

* అరటిపండు :
రాత్రిపూట అరటిపండు తినడం ఆరోగ్యకరం కాదు. ఎందుకంటే నిద్రిస్తున్నప్పుడు శరీర ఉష్ణోగ్రతను పెంచే అవకాశం ఉంది. నిద్రను తగ్గిస్తుంది. రాత్రి సమయంలో అరటిపండు జీర్ణం కాదు. ఈ కారణంగా మీరు రాత్రిపూట అరటిపండ్లను తినకూడదు.

* పండ్లు తినడానికి ఉత్తమ సమయం ఏది ?
-ఉదయం అల్పాహారం తర్వాత 11 లేదా 12 గంటలకు మీకు నచ్చిన పండ్లను తినవచ్చు.
-అంతే కాకుండా మధ్యాహ్న భోజనం తర్వాత పండ్లు తినవచ్చు.
-పండ్లు తినడానికి ఉత్తమ సమయం సాయంత్ర.
– స్నాక్స్ తినే టైం మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 5:00 వరకు పండ్లు తినవచ్చు.
-ఈ సమయం మీ శరీరానికి పండ్ల నుండి పూర్తి స్థాయి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మీ జీర్ణ శక్తిని పెంచుతుంది.