తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

చెన్నై: తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ కంటైనర్, సిమెంట్ ట్రైలర్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 10 మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరేగా అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ధర్మపురి నుంచి సేలం రహదారిపై తోప్పూర్ వద్ద సిమెంట్ ట్రైలర్ వాహనం, కంటైనర్ ను ఢీకొట్టింది. దీంతో వెనక నుంచి వేగంగా వస్తున్న 8 వాహనాలు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో పలు కార్లు ధ్వంసమైనట్లు వారు వెల్లడించారు.