బండి సంజయ్ కారుపై దాడి

హైదరాబాద్‌: గ్రేటర్ హైదరబాద్ నగరంలోని నెక్లెస్‌రోడ్డులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒక హోటల్‌కు వచ్చిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను టీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకున్నారు. ఆయనతో ఎక్కువ మంది ఉండటంతో కొందరు కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కారు అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నినాదాలు చేస్తు..సంజయ్‌ కారును ధ్వంసం చేశారు. ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో బండి సంజయ్‌ను పోలీసులు వేరే కారులో పంపారు.