హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కరోనా బారిన పడ్డారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలో తనకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మంత్రి పువ్వాడ వెల్లడించారు. హైదరాబాద్‌లోని తన ఇంటిలో ఐసోలేషన్‌లో ఉన్నట్లు మంత్రి వివరించారు. ఇటీవల తనను కలిసిన వారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ కోరారు. కరోనా నుంచి త్వరగా కోలుకుని ఎప్పటిలాగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానని ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు. తనను కలువడానికి గాని, ఫోన్ చేయడానికి గాని ఎవరూ ప్రయత్నించవద్దని విజ్ఞప్తి చేశారు.