నాంపల్లి కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే అరూరి

నాంపల్లి కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే అరూరిహైదరాబాద్: 2014లో జరిగిన శాసనసభ ఎన్నికలలో వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడినట్లు వర్ధన్నపేట టిఆర్ఎస్ ఎమ్మెల్యే అరూరి రమేష్ పై కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు ఎమ్మెల్యే అరూరి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్బంగా కేసు పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు ఎమ్మెల్యే అరూరి రమేష్ పై నమోదైన కేసును కొట్టివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.