వరంగల్ లో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కాన్వాయ్‌పై దాడి

వరంగల్‌: భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కాన్వాయ్‌పై దాడి జరిగింది. వరంగల్ అర్బన్‌ జిల్లా భాజపా కార్యాలయంలో ఎంపీ విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం బయటకు వెళ్తున్న సమయంలో కొంతమంది తెరాస కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు వచ్చారు. వరంగల్ లో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కాన్వాయ్‌పై దాడిదీంతో అక్కణ్నుంచి బయలుదేరిన అరవింద్‌ కారును అడ్డుకోవడానికి తెరాస కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుంటుండగా.. కాన్వాయ్‌పై దాడి చేశారు. ఆ తర్వాత పక్కనే ఉన్న భాజపా కార్యాలయంలోకి వెళ్లడానికి తెరాస కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న భాజపా నాయకులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోటాపోటీగా నినాదాలు చేస్తున్న ఇరుపార్టీల కార్యకర్తల మధ్య తోపులాట కూడా జరిగింది. తెరాస కార్యకర్తలను పోలీసు స్టేషన్‌కు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది.