మహిళ క్యారెక్టర్‌పై కరపత్రాలు

మహిళ క్యారెక్టర్‌పై కరపత్రాలు
ప్రశాశం జిల్లా : ప్రకాశం జిల్లాలో కొందరు వ్యక్తులు చేసిన అమానవీయ పని వల్ల ఓ మహిళ అవమాన భారం తట్టుకోలేక దారుణమైన నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని వేటపాలెం మండలం జాండ్రపేట గ్రామంలో ఓ వివాహిత భర్త నుంచి విడాకులు తీసుకుని పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటుంది. ఆమెపై వ్యక్తిగతంగా, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఈ నెల 13వ తేదీ ఉదయం కొందరు కొన్ని కరపత్రాలు ప్రచురించారు. జాండ్రపాలెం, దేవాంగపురి గ్రామాల్లోని కొన్ని టీ దుకాణాలు, కూడళ్లలో ఆమె ప్రవర్తన, వ్యక్తిత్వం కించపరిచేలా మూడు పేజీల పేపర్లు పంచిపెట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు పని గట్టుకుని మరీ ఉద్దేశపూర్వకంగా ‘ఆమె అలా చేసింది, ఇలా చేసింది. ఆమె వ్యక్తిత్వం ఇలాంటిది’అంటూ కరపత్రాల్లో రాసి కొన్ని చోట్ల పంపిణీ చేశారు. అదే రోజు ఈ విషయం సదరు మహిళకు తెలవడంతో వేటపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ‘మీకు ఎవరిపై అయినా అనుమానం ఉందా? అనుమానస్తుల పేరు చెప్తే వాళ్లని పిలిపించి విచారణ చేస్తాం. ప్రస్తుతం బిజీగా ఉన్నాం’అంటూ పోలీసులు సమాధానం ఇచ్చారు. దీంతో ఆమె ఇంటికి వెళ్లారు. అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల మధ్య గంటన్నరపాటు గొడవలు జరిగాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లోకి వెళ్లి విష పదార్థం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఆ మె విడాకుల నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పోలీసులు మత్స్యకార గ్రామాల మధ్య గొడవల విషయంలో హడావిడిగా ఉండటంతో ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదని సమాచారం.