విశాఖ: విశాఖలో జనసేన కార్యకర్త ఆత్మహత్య కలకలంరేపింది. రమణమూర్తి అలియాస్ జానీ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ముగ్గురు వేధింపులతో ఆత్మహత్య పాల్పడుతున్నట్లు లేఖ రాశారు. తన మరణానికి ప్రధాన కారకులు ప్రదీప్, రాజీ, బాలాజీ అనే ముగ్గురు కారణమని ఆ లేఖలో తెలిపారు. జనసేన పార్టీలో కీలక కార్యకర్తగా ఉన్న రమణమూర్తి అలియాస్ జానీ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి దారితీసింది. సమాచారం తెలుసుకున్న స్థానికపోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకున్నారు.. జానీ ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు.