ఆడపడుచుకు వద్దిరాజు ఆర్థిక సాయం

ఆడపడుచుకు వద్దిరాజు ఆర్థిక సాయంఖమ్మం జిల్లా: కష్టాల్లో వున్న ఓ పేదింటి కూతురు కల్యాణానికి ప్రముఖ వ్యాపార వేత్త, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఆర్థిక సాయం చేసి , బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన దమ్మాల పాటి నర్సింహారావుకు ఇద్దరు కూతుళ్లు. కొన్నేండ్ల క్రితం నర్సింహరావు అనారోగ్యంతో చనిపోవడంతో ఆయన భార్య మానసికంగా పరస్థితి సరిగ్గా లేక ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో చనిపోయిన తండ్రి, మతిస్థిమితం సరిగ్గా లేక ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయిన తల్లి.. దీంతో దిక్కుతోచని స్థితిలో వున్న ఇద్దరు కూతళ్లను నాయనమ్మ, తాతయ్య దమ్మాలపాటి లీల, పెద్దనాగేశ్వరరావు చేరదీశారు. వారిని పెంచి పోషించి పెద్ద చేశారు. మనువరాళ్ల పోషణ కోసం నాయనమ్మ లీల అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా కూలి పనులకు వెళ్తోంది. అయితే ఇటీవల పెద్దమ్మాయి ఉషశ్రీ పెండ్లి కుదిరింది. కానీ చేతిలో చిల్లి గవ్వా లేకపోవడంతో సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతవుతున్నారు. ఈ విషయాన్ని స్థానికులు, మిత్రుల ద్వారా తెలుసుకున్న ప్రముఖ గ్రానైట్ వ్యాపారి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర వివాహ ఖర్చుల నిమిత్తం రూ.50వేలు ఆర్థిక సాయం అందించారు. పెండ్లి వస్త్రాలతో పాటు నగదును ఖమ్మంలోని తన స్వగృహంలో వద్దిరాజు రవిచంద్ర అందచేశారు. ఈ కార్యక్రమంలో మల్లారం గ్రామ మాజీ సర్పంచ్ దుగ్గిదేవర వెంకటలాలు పాల్గొన్నారు.