కరీంనగర్ జిల్లా: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100 పైగా సీట్లు గెలుచుకుని గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగురవేస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఏ పార్టీతో పొత్తుల అవసరం లేకుండా మేయర్ స్థానం గెల్చుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ ను దేశానికే ఆదర్శంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారని అన్నారు. తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయవంటిదన్నారు. ఎవరితో పొత్తు లేకుండా ఎక్స్ ఆఫీషియో ఓట్లు కూడా అవసరం లేకుండా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్పై బీజేపీ చేస్తున్న తప్పుడు అరోపణలు మానుకుంటే మంచిదన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని తెలిపారు. ఆరేళ్లలో ఎన్నో మల్టీ నేషన్లు కంపెనీలు హైదరాబాద్కు వచ్చాయని మంత్రి చెప్పారు. గ్రేటర్ ప్రజలు ప్రశాంతతను కోరుకున్నారు కాబట్టే టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారని అన్నారు.