విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న విప్​ చెవిరెడ్డి

శాస్త్రోక్తంగా ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట
ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్​ చెవిరెడ్డివిగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న విప్​ చెవిరెడ్డితిరుపతి: తిరుపతి రూరల్ మండలం తనపల్లి రోడ్డుకు సమీపంలో ఉన్న వినాయక నగర్ లో శ్రీ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టను శుక్రవారం అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, తుడా చైర్మన్​, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంగాభవాని అమ్మవారి ఆలయం ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. అంతకుముందు ఆలయ అర్చకులు చెవిరెడ్డి కి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డికి ప్రజలు తమకు రహదారి సమస్య పరిష్కరించాలని కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులకు రహదారి అంచనా తయారు చేయాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో తిరుచానూరు మార్కెట్ యార్డ్ చైర్మన్​ శ్రీ విద్య గణపతి నాయుడు, వైఎస్సార్సీపీ నాయకులు జనార్ధన్ యాదవ్, నరసింహా రెడ్డి, మునిరత్నం, ఇస్మాయిల్, కిరణ్, కృష్ణ, నాయకులు పాల్గొన్నారు.