అది తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తా : కేటీఆర్

అది తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తా : కేటీఆర్

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాటల తూటాలు పేల్చారు. వరంగల్, హనుమకొండ, నర్సంపేటలో పర్యటించి, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం హనుమకొండ హయగ్రీవాచారి గ్రౌండ్ లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సభకు హాజరైన కేటీఆర్ బీజేపీని టార్గెట్ చేస్తూ ధ్వజమెత్తారు.అది తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తా : కేటీఆర్ప్రధాని మోడీ పైసలతోనే ఈ ప్రభుత్వం నడుస్తుందని ఓ చిల్లరగాడు మాట్లాడుతుండని కేటీఆర్ నిప్పులు చెరిగారు. నిరాటంకంగా తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ పై, రాష్ట్ర పాలనాతీరుపై విమర్శలు చేస్తున్న తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులకు కేటీఆర్ మాటలతో చురకలు పెట్టారు. బహిరంగ సభా వేదిక ద్వారా చెబుతున్నా.. రాసుకో రాష్ట్ర మంత్రిగా చెప్తున్నా, తప్పు అయితే నా మంత్రి పదవిని తీసి ఎడమకాలి చెప్పులా పడేస్తా. ఈ యేడున్నరేండ్లలో తెలంగాణ ప్రజలు తమ చెమట, రక్తం ధారపోసి పన్నుల రూపంలో కేంద్రానికి రూ. 3లక్షల 65వేల 797 కోట్లు ఇచ్చారు. మరి కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చింది మాత్రం రూ. 1లక్షా 68 వేల 647 కోట్లు మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.

మన పైసలు యోగి వద్దకు వెళ్లాయి. ఇతర రాష్ట్రాలకు మోడీ పంపుతాడు. తెలంగాణ పైసలను బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఖర్చు చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. నేను చెప్పింది తప్పైతే మంత్రి పదవికి రాజీనామా చేసి, సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతానని అన్నారు. నేను చెప్పింది తప్పని, దమ్ముంటే బీజేపీ నాయకులు రుజువు చేయాలని సవాల్ చేశారు. ఎవడి సొమ్ముతో ఎవడు కులుకుతున్నాడు అని కేటీఆర్ ఆగ్రహంగా ప్రశ్నించారు. ఇక తెలంగాణకు ఏం చేయని మోడీ మనకెందుకు, బీజేపీ ప్రభుత్వం మనకెందుకు అని కేటీఆర్ ప్రశ్నించారు.