హీరో అర్జున్ కూతురు ఐశ్వ‌ర్యకి క‌రోనా

చెన్నై; ‌కరోనా మ‌హ‌మ్మారి సెల‌బ్రిటీల‌ని కూడా క‌ల‌వ‌ర పెట్టిస్తుంది. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు కరోనా బారిన ప‌డ‌గా, తాజాగా యాక్ష‌న్ హీరో అర్జున్ కూతురు ఐశ్వ‌ర్యకి క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చెప్పుకొచ్చింది. రీసెంట్‌గా నాకు క‌రోనా సోకిన‌ట్టు తేలింది. వైద్యుల స‌ల‌హాలు పాటిస్తూ హోం క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవ‌లి కాలంలో నాతో ఎవ‌రైన కాంటాక్ట్‌లో ఉంటే వారు కూడా ఒకసారి క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోండి. అంద‌రూ క్షేమంగా ఉండండి. త‌ప్ప‌క మాస్క్ ధ‌రించండి. హీరో అర్జున్ కూతురు ఐశ్వ‌ర్యకి క‌రోనావీలైనంత త్వ‌ర‌లోనే నేను కోలుకుంటాను అని ఆశిస్తున్నాను ఐశ్వ‌ర్య పేర్కొన్నది. ఐశ్వర్య అర్జున్ 2013లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు చిరంజీవి స‌ర్జా అంత్య‌క్రియ‌ల‌కి వెళ్లిన స‌మ‌యంలోనే ఐశ్వ‌ర్య‌కి క‌రోనా సోకింద‌ని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం చిరంజీవి సోద‌రుడు ధృవ స‌ర్జా .. త‌న‌తో పాటు త‌న భార్య‌కి క‌రోనా సోకింద‌ని ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్న‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే.