త్వరలో మున్సిపల్ శాఖలో 3,712 ఉద్యోగాలు

త్వరలో మున్సిపల్ శాఖలో 3,712 ఉద్యోగాలు

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : నగరాలు, పట్టణాలు ప్రణాళికాబద్దంగా అభివృద్ధి జరిగేలా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మంత్రి కేటీఆర్ అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జీడబ్ల్యూఎంసీ, కూడాతో పాటు పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఆర్థిక సంవత్సరంలో మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన 10 అభివృద్ధి అంశాలను వివరించారు. మున్సిపల్ శాఖలో 3,712 ఉద్యోగాల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని తెలిపారు. త్వరలోనే నియామకాలు చేపట్టి సిబ్బంది కొరత తీర్చుతామని కేటీఆర్ పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో 50 వేల జనాభాకు ఒక వార్డు అధికారిని నియమిస్తామని అన్నారు.త్వరలో మున్సిపల్ శాఖలో 3,712 ఉద్యోగాలుగ్రేటర్ వరంగల్ లో వర్క్ ఇన్స్పెక్టర్లను నియమిస్తామని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ నిబంధనల మేరకు లక్ష జనాభాకు 280 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మున్సిపాలిటీలకు మంజూరైన నిధులను ప్రాధాన్య క్రమంలో వినియోగించుకోవాలని సూచించారు. టీయూఎఫ్ఐడీసీ నిధులను వందశాతం వినియోగించుకోవాలని ఆదేశించారు. వరంగల్ స్మార్ట్ సిటీ పథకంలో రాష్ట్ర వాటా రూ. 250 కోట్లు కట్టేలా చర్యలు తీసుకోవాలని ఎంఏ‍యూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీని కోరారు.

జీడబ్ల్యూఎంసీకి క్రెడిట్ రేటింగ్ ద్వారా రూ. 90 కోట్ల రుణం హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ మంజూరు చేస్తున్నందున రెవెన్యూ జనరేటింగ్ ప్రాజెక్ట్ లలో పెట్టాలని అన్నారు. ఈ నిధులతో హన్మకొండ, వరంగల్ బస్ స్టేషన్స్ అభివృద్ధి చేయుటకు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. కూడా క్రియాశీలంగా పని చేయాలి. వర్ధన్నపేట, పరకాల, స్టేషన్ ఘన్పూర్ లలో ల్యాండ్ పూలింగ్, లే ఔట్ ల ద్వారా ఆదాయం పెంచుకొని అభివృద్ధి చేయాలని ఆదేశించారు.